![]() |
![]() |
.webp)
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాజల్ ఆర్జే కనిపిస్తోంది. రీజన్ ఏంటంటే ఈమె ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అలా ఈమె కొత్త ఇంటి కలను నెరవేర్చుకుంది. ఇక గృహ ప్రవేశ వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఫంక్షన్ కి సిరి హన్మంత్, సింగర్ లిప్సిక, ప్రియాంక జైన్, ప్రియాంక సింగ్ వంటి వాళ్లంతా వెళ్లి ఆమెను విష్ చేశారు.ఇక కాజల్ ఐతే ఆమె కూతురు సోనా పుట్టినరోజు సందర్భంగా కొత్త ఇంటిని తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్నట్లు చెప్పింది..ఇక ప్రియాంక సింగ్ ఐతే తన ఇన్స్టాగ్రమ్ లో కాజల్ గురించి రాసుకొచ్చింది. "కాజల్ అక్క ఎంతో కష్టపడింది. వాళ్ళ ఫామిలీ ఎంతో ప్రేమతో ఉంటుంది.
కాజల్ అక్క సిస్టర్స్ పేరెంట్స్ అందరూ తెలుసు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. నన్ను ఆశీర్వదించారు" అంటూ రాసుకొచ్చింది. ఇక సిరి హన్మంత్ ఐతే "మేము రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాము..ఐనా కానీ ప్రతీ సారి ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇంకా చివరికి నువ్వు అనుకున్నది చేసావు. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నావు. చాల గర్వంగా ఉంది" అంటూ చెప్పింది. ఇక మానస్ నాగులాపల్లి ఫామిలీ అలాగే యానీ మాష్టర్ కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఇక నెటిజన్స్ కూడా కాజల్ ఫామిలీకి కొంత ఇంటితో పాటు వాళ్ళ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాజల్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఈమె ఆర్జేగా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.
![]() |
![]() |